
వంట గ్యాస్ ధరలు మళ్ళీ పెరిగాయి. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సబ్సిడీ సిలిండర్ ధర 25 రూపాయలు పెంచగా ఒక్క సిలిండర్ ధర 960 కి చేరుకుంది. రవాణా ఛార్జీల పేరిట ఏజెన్సీలు మరో 40 అదనంగా వసూలు చేస్తున్నాయి. దీంతో సిలిండర్ రేటు వెయ్యికి చేరింది. రెండు నెలల వ్యవధిలో మూడుసార్లు ధరలు పెరగడం పట్ల మహిళలు మండిపడుతున్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని కోరుతున్నారు