
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించి కనీస మద్దతు ధర కోసం రైతులు పడుతున్న కష్టాలను వారినే అడిగి తెలుసుకోనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి రైతుల కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ నెల 16న సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లో పర్యటించి ఆ తర్వాత జనగామ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.