
నటసింహా నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోలు, ఫస్ట్ లిరికల్ సాంగ్ అందర్నీ ఆకట్టుకోవడమే కాక సినిమా మీద అంచనాలను మరింత పెంచాయి. ఇక నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘అఖండ’ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. ప్రతి ఫ్రేమ్ లో అల్లాడించే కంటెంట్ ని ఏర్చి కూర్చారని తాజా ట్రైలర్ నిరూపించింది.
విధికి విధాతకి విశ్వాసానికి సవాళ్లు విసరకూడదు! అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. “అంచనా వేయడానికి పోలవరం డ్యామా పట్టి సీమ తూమా .. పిల్ల కాలువ“ అంటూ బాలయ్య పొలిటికల్ పంచ్ తో ఎంట్రీ అదుర్స్. ఇక ఈ చిత్రంలో బాలయ్య ఓవైపు .. శతాధిక చిత్రాల శ్రీకాంత్ మరోవైపు.. రగ్గ్ డ్ మాస్ జగపతి ఇంకో వైపు అదరగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీకాంత్ ఊరమాస్ గెటప్ రౌడీయిజం మరో లెవల్లో ఆవిష్కరిస్తున్నారు బోయపాటి. ఈ సినిమాతో అతడికి సరికొత్త ఇమేజ్ ని ఆపాదిస్తున్నారు.
కళ్లు తెరిచి జూలు విదిలిస్తే.. అంటూ జగపతి రగ్గ్ డ్ గెటప్ కూడా ఆద్యంతం ఆసక్తిని పెంచుతోంది. “ఒక మాట నువ్వు అంటే అది శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. దైవ శాసనం..“.. `ఒకసారి డిసైడై బరిలో దిగితే బ్రేకుల్లేని బుల్డోజర్ ని.. తొక్కి పారదొబ్బతా లెఫ్టా రైటా టాపా బాటమా.. కొడకా ఇంచు బాడీ దొరకదు.. !! అంటూ పిచ్చెక్కించే పంచ్ లతో అదరగొట్టాడు. ఇక అఘోరా పాత్ర డైలాగుల్లోనూ పంచ్ లకు కొదవేమీ ఉండదు.
“నీకు సమస్య వస్తే దండం పెడతారు. మేము ఆ సమస్యకే పిండం పెడతాం.. బోత్ ఆర్ సేమ్.. అంటూ బాలయ్య పంచ్ లు అదరహో అనాలి. అయితే ట్రైలర్ ఆద్యంతం భారీ మాస్ యాక్షన్ ని మాత్రమే హైలైట్ గా ఆవిష్కరించారు. ప్రగ్య జైశ్వాల్ ని ఛమక్కులా చూపించి వదిలేసారు. రొమాన్స్ ని మించి కథ కంటెంట్ పై బోయపాటి బాగా వర్కవుట్ చేసినట్టే కనిపిస్తోంది. మొత్తానికి అఖండ ట్రైలర్ మసాలా కంటెంట్ తో రక్తి కట్టిస్తోంది. బాలయ్య అభిమానుల్లో అమాంతం అంచనాలు పెంచే ట్రైలర్ ఇది. ఇక సింహంలా చెలరేగిపోయారు బాలయ్య.
https://www.youtube.com/watch?v=CWnu8pQRCkQ