
ఉదయం నుండి బద్వేల్ పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోందని.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె. విజయానంద్ పేర్కొన్నారు. బద్వేల్ లో ఉదయం 11 గంటల వరకు 21 % పోలింగ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు. పోలింగ్ సమయం లో ఒకటి రెండు పని ఈవీఎమ్ లు పని చేయకపోతే వెంటనే రిప్లేస్ చేశామని వెల్లడించారు.
ఎక్కడా ఈవీఎమ్ లు మొరాయించి పోలింగ్ ఆలస్యం అయిన సంఘటన ఎదురవలేదన్నారు ఎన్నికల అధికారి కె. విజయానంద్. ఉదయం 9 గంటల వరకు 10.49% పోలింగ్ నమోదయ్యిందని.. ఆ తర్వాత కాస్త పుంజుకుందన్నారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని… దొంగ ఓటర్లు వంటి సంఘటనలు జరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు ఎన్నికల అధికారి కె. విజయానంద్. ఇంత వరకు మాకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఇక అటు హుజురాబాద్ నియోజక వర్గంలో పోలింగ్ శాతం… ఉదయం 11 గంటల వరకు 33 శాతం నమోదైంది.