
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డ జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యాడు. డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ నాలుగు వారాల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. గురువారం బాంబే హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో మరికొద్దిసేపట్లో ఆయన జైలు నుండి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ తన లీగల్ టీమ్ తో కలిసి కార్లలో ఉదయాన్నే కొడుకును తీసుకువచ్చేందుకు ఆర్థర్ రోడ్డు జైలుకు బయలుదేరారు.