
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా కొనసాగుతుంది. ఇప్పటికే కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. నెల్లూరు కార్పొరేషన్లోనూ వైసీపీ హవా నెలకొంది. దాచేపల్లి మున్సిపాలిటీలో వైసీపీ-టీడీపీ మధ్య నువ్వానేనా అన్నట్టుగా ఫలితాలు వస్తున్నాయి. కుప్పంలోని 14వ వార్డును వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. గురజాల మున్సిపాలిటీలోనూ వైసీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన చాలా ఫలితాలు వైసీపీకి అనుకూలంగానే వచ్చాయి. అక్కడక్కడా బోణీ చేసింది జనసేన.