
ఏపీ మంత్రి కోడలి నాని, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు “వైసీపీ నేతలకు భయం అంటే ఏంటో చూపిస్తానని” ఈ వ్యాఖ్యలకు బదులు చెప్పారు కోడలి నాని. కోడలి నాని మాట్లాడుతూ.. మమ్మల్ని భయపెడతానంటున్నావ్… ‘జానీ’ లాంటి సినిమా ఇంకోటి చూపిస్తావా ఏంటి? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టుని చదివే నువ్వా మమ్మల్ని భయపెట్టేది? అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్ అని విమర్శించారు. పవన్ ను చూసి ఆయన అభిమానులు భయపడాల్సిందే తప్ప తాము కాదని స్పష్టం చేశారు.
“నువ్వు జీవితంలో వైసీపీని ఓడించలేవు… ముందు నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావో, లేదో అది చూసుకో అని స్పష్టం చేశారు. అన్ని పార్టీలతో కలిసి రా… చూసుకుందాం” అని సవాల్ విసిరారు.