
AP Budget Session: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 24 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. మార్చి 16న వార్షిక బడ్జెట్ను ఏపీ సర్కార్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ లో మేనిఫెస్టో పథకాలతో పాటు కొత్త కేటాయింపులు చేసే అవకాశం ఉంది.