
AP Budget 2023-24: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి సుమారు రూ.2.79 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు సమాచారం. మంత్రి బుగ్గన సాధారణ బడ్జెట్, మంత్రి కాకాణి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ ఉదయం ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు.