
రాజ్ తరుణ్ హీరోగా గవిరెడ్డి శ్రీను దర్శకత్వంలో ‘అనుభవించు రాజా’ సినిమా రూపొందింది. అన్నపూర్ణ స్టూడియోస్ – శ్రీవెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పాత్రపరంగా డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో రాజ్ తరుణ్ కనిపించనున్నాడు. పూర్తిగా కోనసీమ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. మేకర్స్ సినిమా విడుదలకు ముందే జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను నాగార్జున, రామ్ చరణ్ లాంచ్ చేశారు.
నాగ చైతన్య ఈ రోజు సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ఈ సాంగ్… రాజ్ తరుణ్ క్యారెక్టరైజేషన్‌ను స్పష్టంగా చూపించే టైటిల్ ట్రాక్. జీవితంలో ఎలాంటి టెన్షన్లు లేకుండా సంతోషంగా ఉండే రాజులా రాజ్ తరుణ్ ఈ సాంగ్ లో కనిపిస్తున్నాడు. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, గోపి సుందర్ ట్యూన్స్ అందించారు. రామ్ మిరియాల పాడిన ఈ మాస్ సాంగ్ ఎనర్జిటిక్ గా ఉంది. కాశీష్ ఖాన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.