
ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ బోర్డు చేసే తప్పిదాల వల్లనో లేక ఇంకోటి కానీ కరెంటు బిల్లు ల మోత మాత్రం గుండెలు అదిరేలా వున్నాయి. మొన్న ఒక చిన్న గుడిసెకు లక్షల్లో బిల్లు రావడం మర్చిపోక ముందే అదే రేంజ్ లో ఇంకో చిన్న షాప్ కు 57 వేళా పైచిలుకు బిల్లు వచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ పంక్చర్ షాపుకు రూ.57 వేలు కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో బిల్లు చూసిన షాపు యజమానికి గుండెపోటు వచ్చిన్నంత పని అయింది. వెంకన్నబావి వీధిలో బసవ అనే వ్యక్తి పంక్చర్ షాపు నిర్వహిస్తున్నారు. చిన్న పంక్చర్ షాపునకు రూ.57,965 బిల్లు వచ్చినట్లు బసవ తెలిపారు. ఆగస్టు నెలలో కేవలం రూ.100 వచ్చిందని కానీ ఈ నెల ఒకే సారి వేలల్లో కరెంట్ బిల్లు రావడంపై బాధితుడు గుండెలు బాదుకుంటున్నారు. కరెంట్ ఆఫీసుకు వెళ్తే అధికారులు ఎవరూ లేరని తెలిపారు.