
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, నగరి ఎమ్మెల్యే రోజాకు నగరి చేనేత కార్మికులు అదిరి పోయే గిఫ్ట్ ఇచ్చారు. హాప్ సిల్క్ శారీ జరీ బోర్డర్‌పై సీఎం జగన్, ఎమ్మెల్యే రోజా బొమ్మలను నేసి వారికి గిఫ్ట్‌గా అందచేశారు. నగరిలో చేనేత పరిశ్రమ డెవలప్మెంట్ కు స్థానిక ఎమ్మెల్యే ఆర్కే రోజా చూపుతున్న శ్రద్ధకు ధన్యవాదాలు చెబుతూ, చేనేత కార్మికులు రోజా, సీఎం జగన్ చిత్రాలను చీరల బోర్డర్‌పై నేశారు.
చేనేత పరిశ్రమను టెక్నాలజీ వైపు మళ్లించేందుకు ఎమ్మెల్యే రోజా, ఆమె హజ్బెండ్, రాయలసీమ వీవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణిలు హిందూపురం నేత పరిశ్రమవర్గాలతో చర్చించి నగరి మున్సిపాలిటీకి ఆధునాతన డిజైన్లలో చీరలు నేసే జకార్డ్ యంత్రాలు తెప్పించారు. ఈ యంత్రాలను ఎమ్మెల్యే రోజాప్రారంబించారు.