
అన్నా చెల్లెళ్ల ప్రేమానుబంధానికి ప్రతీక రాఖీ పండగ అని, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ అన్నారు. తోడబుట్టిన వారికే కాదు, జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి మహిళకు అన్నగా అండగా నిలవడం మన కర్తవ్యమని మన సంస్కృతి చెబుతోందని అన్నారు. ఒకవైపు రాఖీ శుభాకాంక్షలు చెబుతూనే మరోవైపు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా లోకేశ్ ఓ ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఇకపై ఎక్కడ ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా ఒక అన్నగా స్పందిస్తానని ఈ రాఖీ పౌర్ణమి రోజున ప్రతి చెల్లికి నేను హామీ ఇస్తున్నాను. ఏపీలో ఇప్పటివరకూ ఉన్మాదుల దుశ్చర్యలకు బలైపోయిన ప్రతి ఆడపిల్లకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తాను.’ అని లోకేశ్ ప్రతిజ్ఞ చేశారు.
సమాజంలో స్త్రీకి రక్షణగా నిలిచి, గౌరవించే తత్వాన్ని సొంత కుటుంబం నుంచే అలవాటు చేసే ఉత్తమ సంప్రదాయానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. తోడబుట్టిన అక్క చెల్లెళ్లకే కాదు, జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి మహిళకు అన్నగా అండగా నిలవడం మన కర్తవ్యం అని భారతీయ సంస్కృతి చెబుతోంది.(1/3)#Rakshabandhan pic.twitter.com/mGT5ObmRwk
— Lokesh Nara (@naralokesh) August 22, 2021