
జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ బోర్డులో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. దీన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ బోర్డుతో పాటు 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ జగన్ సర్కార్ ఇటీవల జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది నిబంధనలకు విరుద్ధమని, దీని వల్ల సాధారణ భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడతారని హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వం జారీ చేసిన జీవోను తప్పుబట్టింది. దీని అమలును తాత్కాలికంగా నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
టీటీడీ స్వతంత్రతను దెబ్బతీసేలా జీవో ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. దేవాదాయ చట్టానికి విరుద్ధంగా నియామకాలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. టీటీడీ బోర్డులో 80 మంది కంటే ఎక్కువగా సభ్యులు ఉండకూడదని చట్టం చెబుతోందని, ప్రభుత్వం జారీ చేసిన 568, 569 జీవోలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని వివరించారు. కాబట్టి, ఈ జీవోలను రద్దు చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దేవాదాయ చట్టాన్ని ఎక్కడా అతిక్రమించలేదని, నిబంధనలనకు అనుగుణంగానే ప్రభుత్వం నియమకాలను చేపట్టిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. పిటిషనర్ల తరఫు వాద