
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్ లో పెట్టకూడదని నిర్ణయించింది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ విధానానికి జగన్ సర్కార్ స్వస్తి పలికింది. జీవోలను పబ్లిక్ డొమైన్స్ లో ఉంచకూడదంటూ పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై ఆఫ్ లైన్ లో జీవోలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన చేస్తూ ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేసినట్టు సమాచారం. కాగా, ప్రభుత్వ వెబ్ సైట్ లో జీవోలను ఉంచే ప్రక్రియ 2008 నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా ఈ ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి.