
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వున్న హాస్పిటల్ విధానాలపై, కరోనా థర్డ్ వేవ్ గురించి సమావేశంలో చర్చించారు.
రాష్ట్రంలో 140 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు అక్టోబర్ 6 నాటికి సిద్ధం అవుతాయని అధికారులు సీఎంకు తెలిపారు. కోవిడ్ -19 నియంత్రణపై వైద్య, ఆరోగ్యశాఖతో జరిగిన సమీక్షలో సీఎం శ్రీ వైయస్ జగన్ మాట్లాడుతూ ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ పై దృష్టి పెట్టాలని సూచించారు.
రాష్ట్రంలో 140 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు అక్టోబర్ 6 నాటికి సిద్ధం అవుతాయని అధికారులు సీఎంకు తెలిపారు. కోవిడ్ -19 నియంత్రణపై వైద్య, ఆరోగ్యశాఖతో జరిగిన సమీక్షలో సీఎం శ్రీ వైయస్ జగన్ మాట్లాడుతూ ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ పై దృష్టి పెట్టాలని సూచించారు. 1/2 pic.twitter.com/N0PAj0dOtp
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 8, 2021
థర్డ్ వేవ్ నేపథ్యంలో నూతన చికిత్సా విధానాలతో సిద్ధంగా ఉండాలని, విలేజ్ క్లినిక్ ల స్థాయిలో టెస్టులు జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సులు కూడా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.