
ప్రముఖ యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్, ఫోటో షూట్స్ షేర్ చేయడమే గాక సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై స్పందిస్తుంటుంది ఈ బ్యూటీ. ట్రోలింగ్స్ ఎదురైనా, ఎవరేమనుకున్నా తాను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని విషయాలపై మంత్రి కేటీఆర్‌ని సూటిగా ప్రశ్నించింది ఈ జబర్దస్త్ భామ.
కరోనా టీకా వేయాల్సిన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంగతేంటి సార్? అంటూ అనసూయ… కేటీఆర్ ను ప్రశ్నించింది. పిల్లలను స్కూల్స్ కు పంపించాలని యాజమాన్యాలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి.? అంటూ నిలదీసింది. పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు వారికి ఏమైనా జరిగితే తమ బాధ్యత కాదని పేర్కొంటూ పేపర్‌పై యాజమాన్యాలు సంతకం కూడా చేయించుకుంటున్నాయని అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. చెప్పండి.. ఇదెక్కడి న్యాయం.. ఇది ఎంతవరకు సమంజసం. ఎప్పటిలాగే మీరు సరైన మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నా…అంటూ అనసూయ కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించింది. మరి అనసూయ ప్రశ్నలకు కేటీఆర్ ఎలా సమాధానం ఇస్తారో చూడాలి.