
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. అకీరా పవన్ కళ్యాణ్ సినిమాతోనే టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడట. ప్రస్తుతం పవన్ చేస్తున్న చిత్రాల్లో `హరిహర వీరమల్లు` ఒకటి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో అకీరా ఓ కీలక పాత్ర పోషించనున్నాడని సమాచారం. తండ్రి పవన్ తో పాటు అకీరా కలిసి పలు సీన్లలో అలరించనున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఏదేమైనా తండ్రి, కొడుకులు ఒకే ఫ్రేములో కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే అవుతుంది. పవన్-రేణు దేశాయ్ ల కుమారుడు అకీరా నందన్. తల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ సినిమా ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాలో అతిథి పాత్రలో అకీరా కనిపించాడు. ఇప్పుడు పూర్తిస్థాయిలో అలరించేందుకు రెడీ అయిపోయాడు. ఆరడగులకుపైగానే ఎత్తున్న అకీరా. ఇటీవల కర్రసాము చేస్తున్న ఓ వీడియోలో అకీరా కనిపించాడు. అకీరా వెండితెర అరంగేట్రం ఎప్పుడా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి ‘హరిహర వీరమల్లు’లో అకీరా నటించే విషయమై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకూ ఎదురుచూడాల్సిందే.