
రొమాంటిక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా..హీరో ఆకాశ్ పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాన్న పూరీ జగన్నాథ్ కాలర్ ఎగరేసేలా సినిమాలు చేయడమే తన లక్ష్యమని అన్నాడు. ఈ కార్యక్రమానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆకాశ్ పూరీ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా వస్తోన్న సినిమా ‘రొమాంటిక్’. సరికొత్త కాన్సెప్ట్ తో లవ్ స్టోరీ నేపథ్యంలో ‘రొమాంటిక్’ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాను అక్టోబర్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రీసెంట్ గా ప్రభాస్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్.. సినిమాకు యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. మాఫియా నేపథ్యంలో వస్తున్న ఓ ప్రేమ కథగా తెరకెక్కింది. రమ్యకృష్ణ ఈ సినిమాలో ఆకాశ్ పూరికి అత్త పాత్రలో కనిపించనుంది.
విధి నన్ను, పూరీ జగన్నాథ్, ఛార్మిలను కలిపింది. మేం ముగ్గురం ఒక్కటే ఫిక్స్ అయిపోయాం. ‘లైగర్’ తో భారతదేశాన్ని ఊపేయాలని! 2022లో అది జరుగుతుంది. ఆకాశ్ లో తపన ఉంది. ఇంత మంది మధ్య తను అనుకున్నది చెప్పే ధైర్యం ఉంది. ఆకాశ్ సినిమా పిచ్చి గురించి నాకు ఛార్మి చెబుతుంటారు. అన్ని సినిమాలూ నచ్చుతుంటాయి. నీలాంటివాళ్లు వందశాతం విజయవంతం కావాలి. కేతికకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా నిర్మాత, రచయిత, ఛార్మి, పూరీ జగన్నాథ్ నా మనుషులు. ‘లైగర్’ కోసం వీళ్లు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు…” అని హీరో విజయ్ దేవరకొండ అన్నాడు.
ఆకాశ్ మాట్లాడుతూ…”దర్శకుడు, మా బృందం అంతా ప్రాణం పెట్టి చేశాం. ఎలాంటి నేపథ్యం లేకున్నా కష్టపడి పరిశ్రమ అనే మహాసముద్రంలో దూకారు మా నాన్న. మధ్యలో పూరీ కెరీర్ అయిపోయిందని అన్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఆయనిచ్చిన ఊపు మామూలుది కాదు. థియేటర్లలో మా నాన్న సంభాషణలు విని ఎగురుతుంటే కాలర్ ఎగరేశా. అలా మా నాన్న కూడా గర్వపడేలా నేను నటిస్తా. మా నాన్న పరిశ్రమ కోసం ఎంతో ఇచ్చారు. నేను ఈ పరిశ్రమలో పుట్టి పెరిగాను. మా నాన్న పరిశ్రమకు ఇచ్చినదానికంటే ఇంకో శాతం ఎక్కువే ఇస్తాను. ఓ లక్ష్యం ఉండాలని చెబుతుంటారు మా నాన్న. ఇకపై మా నాన్న కాలర్ ఎగరేసేలా చేయడమే నా లక్ష్యం” అని ఆకాశ్ పూరీ అన్నాడు.