
దాదాపు 68 సంవత్సరాల తర్వాత సొంత గూటికి చేరుకుంది ‘ ఎయిర్ ఇండియా’. దేశవ్యాప్తంగా అతిపెద్ద విమాన సంస్థ అయినా ‘ ఎయిర్ ఇండియా’ నష్టాల ఊబిలో కూరుకుపోయి తీసి వేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియా ను ప్రైవేటీకరణ చేయాలని బిడ్డింగ్ నిర్వహించింది. ఆ బిడ్డింగ్ లో టాటా గ్రూప్ తన సొంత విమాన సంస్థ ‘ ఎయిర్ ఇండియా’ ను దక్కించుకుంది. ఈ సందర్భంలో ఆ కంపెనీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా సంతోషం వ్యక్తం చేశారు. వెల్ కం బ్యాక్ ‘ ఎయిర్ ఇండియా’ అంటూ ట్వీటర్ తన ఆనందాన్ని పంచుకున్నారు.
Welcome back, Air India ?? pic.twitter.com/euIREDIzkV
— Ratan N. Tata (@RNTata2000) October 8, 2021
‘ఎయిరిండియా కోసం టాటా గ్రూప్ బిడ్ గెలుచుకోవడం చాలా గొప్ప విషయం! ఎయిరిండియా పునర్నిర్మాణానికి గణనీయమైన కృషి అవసరమని అంగీకరిస్తున్నప్పటికీ.. ఈ పరిణామాలు విమానయాన పరిశ్రమలో టాటాగ్రూప్నకు బలమైన మార్కెట్ అవకాశాలు కల్పిస్తాయని విశ్వసిస్తున్నాం. ఒకప్పుడు జేఆర్డీ టాటా నాయకత్వంలో ఎయిరిండియా.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విమానయాన సంస్థగా ఖ్యాతి గడించింది. ఇప్పుడు ఎయిరిండియాకు అలాంటి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు టాటాలకు మళ్లీ అవకాశం లభించింది. ఈ రోజు జేఆర్డీ టాటా మన మధ్యన ఉంటే ఎంతో ఆనందపడేవారు. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వెల్కమ్ బ్యాక్, ఎయిరిండియా!’’ అని రతన్ టాటా రాసుకొచ్చారు.