
కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లను అందిస్తున్న ‘ఆహా’ ఓటీటీ ప్రేక్షకులకు మరో వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించిన ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ సిరీస్ కు జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌తో యంగ్ హీరో సంతోష్ శోభన్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. రొమాన్స్, ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో సంతోష్ శోభన్, టీనా శిల్పరాజ్, వెంకట్, ఝాన్సీ మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్నారు. ఇటీవల పాపులర్ అయిన యాంకర్ విష్ణు ప్రియ కూడా ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆమె ఇందులో మహి క్యారెక్టర్ పోషిస్తోంది. ‘ఈ విజ్జు గాడు నాకు ప్రపోజ్ చేస్తాడా, లేదా..?’ అనే కన్ఫ్యూజన్తో మహి ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 నుంచి ‘ఆహా’ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.