
గీతా ఆర్ట్స్ బేనర్లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీస్తున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘ఆహా’ పేరుతో వచ్చిన ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో వెబ్ సిరీస్, సినిమాల స్ట్రీమింగ్ జరుగుతాయి.
ప్రారంభమైన రెండు వారాల్లోనే ఆరు లక్షల పైనే రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి అని ‘ఆహా’ ప్రతినిధులు తెలిపారు. అయితే చాలామంది సినిమా నిడివి రెండున్నర్ర గం ఉంటే చూడరు వారికోసమే ‘ఆహ’ ప్రవేశపెట్టింది వెబ్ సిరీస్ సినిమాల తరహాలో రెండున్నర గంటలు కాకుండా, ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ఎపిసోడ్ వీక్షించేందుకే మొగ్గు చూపేవారికోసమీ ఇది..
అయితే తొలి తెలుగు ఓటీటీ అయిన ‘ఆహా’ ఎప్పుడూ సరికొత్త వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు చేరువవుతోంది. ఓవైపు వెబ్‌సిరీస్‌లు, మరోవైపు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్లో ‘ఆహా’ అనేలా చేస్తోంది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ది బెస్ట్ అనిపించే వెబ్ సిరీస్‌లు మీకోసం…
* ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్
* కుడి ఎడమైతే
* లాక్డ్
* అల్లుడు గారు
* 3 రోజేస్
* ఎలెవెన్త్ అవర్
* తరగతి దాటి
* బేకర్ అండ్ బ్యూటీ