
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఇటీవల డెంగ్యూ బారినపడిన ఆయన రక్తంలో ప్లేట్ లెట్స్ పడిపోవడంతో సెప్టెంబర్ 18న ఆస్పత్రిలో చేరాడు. ప్రత్యేక వైద్య బృందం అతడికి వైద్యం అందిస్తోంది. విషయం తెలుసుకున్న సినిమా ప్రముఖులు, ఆయన అభిమానులు శేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం అడివి శేష్ 26/11 ముంబయి టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ అనే సినిమా చేస్తున్నాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఇందులో శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో పాటు గతంలో హిట్టయిన గూఢచారి, హిట్ సినిమాలకు సీక్వెల్స్ లోనూ అడివి శేష్ నటిస్తున్నాడు.