
తమిళ స్టార్ హీరో విశాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు ప్రకటించారు విశాల్. ఈ విషయంలో పునీత్‌కు మాటిస్తున్నానని చెబుతూ విశాల్ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎనిమి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న విశాల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారని, చివరికి తన కళ్లను కూడా దానం చేశారని విశాల్ గుర్తు చేశారు. పునీత్ లేరన్న విషయం నమ్మశక్యం కావడం లేదన్నారు. పునీత్ మరణం ఒక్క చిత్ర పరిశ్రమకే కాదని, మొత్తం సమాజానికే తీరని లోటని అన్నారు. ఆయన సేవా కార్యక్రమాలకు తనవంతు సాయాన్ని అందిస్తానని మాటిచ్చారు. మరో నటుడు ఆర్య మాట్లాడుతూ.. పునీత్ మరణం తీరని లోటని, ఆయన మరణించారన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు.
పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం యావత్ సినీప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచింది. రీల్ హీరోగానే కాకుండా ఎనో సేవ కార్యక్రమాలతో ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్నాడు పునీత్. 1500 మందికి పైగా పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు పునీత్. 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాధాశ్రమాలు, 16 వృద్దాశ్రమాలు, 19 గోశాలలు కట్టించారు పునీత్. అంతే కాదు చనిపోయిన తర్వాత కూడా ఒకరికి కంటివెలుగు అయ్యారు పునీత్. ఆయన తన రెండు కళ్ళను దానం చేశారు.