
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలో ఎక్లాస్పూర్ వద్ద పరకాల డిపో చెందిన ఆర్టీసీ బస్సు బెల్లంపల్లి నుంచి హన్మకొండ వెళ్తున్న క్రమంలో కారును ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఖాన్సాయిపేటకు చెందిన వినీత్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు ప్రయాణికుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 16 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.