
పెద్దపల్లి జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు…ఒక ఘటనలో ఇద్దరు మృతి…మరొక ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు…ఢీకొన్న రెండు వాహనాలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు…అవి కూడా దగ్గర సిరీస్ నంబర్లు కావడం విశేషం…మంథని మండలం బిట్టుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇసుక టిప్పర్ ఢీకొని ఇద్దరు గ్రామానికి చెందిన వ్యక్తులు మృతి చెందగా ఇక్కడి టిప్పర్ నెంబర్ ts25 t 1626 కాగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్ వంతెన వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఉన్న టిప్పర్ నెంబర్ ts25 t 1536గా ఉంది…!
★అయితే మంథని మండలం బిట్టుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన చిలువేరి గట్టయ్య మరియు ధర్ముల రాజమల్లు లు మృతి చెందగా మృతుడి గట్టయ్య కు ఇద్దరు కూతుర్లు,ఒక కుమారుడు ఉండగా రాజమల్లుకు ఇద్దరు కూతుర్లు,ఇద్దరు కుమారులు ఉన్నారు… కాగా ప్రమాదం పై ఆగ్రహం చెందిన గ్రామస్తులు రోడ్డుపై ధర్నా నిర్వహిస్తున్నారు…!
★కాగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇదే రూట్లో ఉన్న ముత్తారాం మండలం ఖమ్మం పల్లి గ్రామంలో ఉన్న మానేరు ఇసుక క్వారీకి వెళ్తుండగా టిప్పర్ రోడ్డు పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టినట్టు సమాచారం…కాగా ఎక్కడో ఉన్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఇసుక కోసం భూపాలపల్లి కి చెందిన టిప్పర్ ఇక్కడికి రావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుండగా అసలు ఆ టిప్పర్ కు ఇసుక రవాణా అనుమతి ఉందా…వే బిల్లు ఉందా లేక అక్రమ రవాణా కోసం వచ్చి ప్రమాదంలో ఇద్దరి మృతికి కారణమా అన్న విషయాలు పోలీసుల విచారణ లో తేలాల్సి ఉంది…మంథని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు…
ఇనుముల సతీష్