
హీరో సూర్య దూకుడు పెంచాడు. లాక్ డౌన్ తర్వాత ఏ హీరో చేయనంత వేగంగా సినిమాలు చేసేస్తున్నాడు. థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో.. ఓటీటీలో విడుదల చేసేందుకు ఏమాత్రం సంకోచించడంలేదు. గత ఏడాది ఓటీటీలో విడుదలైన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా ఘన విజయం సాధించడంతో.. ఇప్పుడు వరుసగా ఓటీటీలోనే సినిమాల విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో.. ఇప్పుడు వరుసగా నాలుగు నెలల్లో నాలుగు సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాలను విడుదల చేస్తున్నాడు. సెప్టెంబరులో ప్రారంభమయ్యే ఈ సూర్య చిత్రలహరి.. డిసెంబరులో ముగుస్తుంది.
Equality is our birth right!!#JaiBhimOnPrime this November @PrimeVideoIN#Jyotika @tjgnan @prakashraaj @RSeanRoldan @srkathiir @KKadhirr_artdir @philoedit @rajisha_vijayan #Manikandan @jose_lijomol @PoornimaRamasw1 @rajsekarpandian@2D_ENTPVTLTD @proyuvraaj @SonyMusicSouth pic.twitter.com/dvL98EQwgb
— Suriya Sivakumar (@Suriya_offl) August 5, 2021
ఈ వివరాలను సూర్య.. ట్విటర్ ద్వారా తెలియజేశారు. సెప్టెంబరు నుంచి వరుసగా నాలుగు నెలల పాటు నెలకో కథ చొప్పున నాలుగు కథలు వినిపిస్తానని, ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలని కోరాడు. ఈ క్రమంలో.. ఆ నాలుగు సినిమాల పోస్టర్లను విడుదల చేశాడు. ఇందులో.. ‘జై భీమ్’ సినిమా నవంబరులో విడుదల కానుంది. ఈ సినిమాలో లాయర్ గా నటిస్తున్న సూర్య.. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడే పాత్ర పోషిస్తున్నాడు. సెప్టెంబరులో ‘రామె.. రావణె’, అక్టోబరులో ‘ఉడన్ పిరప్పె’, నవంబరులో ‘జై భీమ్’, డిసెంబరులో ‘ఓ మై డాగ్’ సినిమాలను విడుదల చేయనున్నట్లు సూర్య వెల్లడించాడు. ఈ నాలుగు సినిమాలను ‘2డీ ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించడం విశేషం.