
హెడింగ్లేలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత్ ఓటమి చవి చూసింది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన కొద్దిసేపటికి పుజారా పరుగులేమి సాధించకుండా ఎల్బీగా రాబిన్సన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అర్ద సెంచరీ సాధించిన అనంతరం భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కీపర్ క్యాచ్ తో రాబిన్సన్ బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు. రాబిన్సన్ ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. 278 పరుగుల చేసిన భారత్ , ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. భారత్ బాట్స్మెన్ నుండి ఒక్కరు కూడా కనీసం పోరాటం చేయలేక పోయారు. సిరీస్ 1-1 తో సమం అయింది. సెప్టెంబర్ 2 న నాల్గో టెస్ట్ ప్రారంభం కానుంది.