
గోపీచంద్, తమన్నా జంటగా క్రీడా నేపథ్యంలో నటించిన చిత్రం ‘సీటీమార్’. అంతా బాగుంటే ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల అయ్యేది. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాకు వారం ముందు విడుదల చేస్తే వర్కౌట్ కాదనే ఉద్దేశ్యంతో వాయిదా వేశారు. ఆ తర్వాత ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ చేద్దామనుకునే లోపు కరోనా సెకండ్ వేవ్ మన దేశంపై విరుచుకుపడింది. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా గణనీయంగా తగ్గడంతో మూవీ విడుదల తేదీ విషయంలో ఉన్న సస్పెన్స్ కు తెర పడింది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్న వార్తే నిజమైంది. ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నారు. తమ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే పక్కాగా విడుదల చేస్తామని, అదీ సెప్టెంబర్ మాసంలో ఉంటుందని నిర్మాతలు కొంతకాలంగా చెబుతూ వచ్చారు. సెప్టెంబర్ 3వ తేదీని ఈ మూవీ కోసం లాక్ చేసినట్టు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో తమన్నా జ్వాలారెడ్డి పాత్ర పోషించారు. దిగంగనా సూర్యవంశీ, భూమిక, రావురమేశ్, పోసాని కృష్ణ మురళీ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. మణిశర్మ స్వరాలు అందించారు.
A..n..d here we go????
Guysssssss…GET READY TO #Seetimaarr ?????
On Sep 3???@YoursGopichand@tamannaahspeaks @srinivasaaoffl @bhumikachawlat @SS_Screens @DiganganaS #Manisharma @adityamusic @soundar16 #SeetimaarrOnSept3 pic.twitter.com/DtAgw13zrl
— Sampath Nandi (@IamSampathNandi) August 24, 2021