
హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలని అన్నిప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజక ఇంఛార్జిగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కి, సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక ఇంకా రసవత్తరంగా మారింది. దీంతో ఆ స్థానంలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న ఎన్నికలు కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గ పీసీసీ ఇన్చార్జిగా దామోదర రాజనర్సింహకు బాధ్యతలు అప్పగించింది. అలాగే, హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల కో ఆర్డినేటర్లుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లు కొనసాగుతారని ప్రకటించింది. ఆయా మండలాలు, మునిపాలిటీల్లోనూ పార్టీ బలోపేతానికి ఇన్చార్జిల వారీగా నియమించింది. ఆది శ్రీనివాస్ మరియు సంగీతం శ్రీనివాస్ వీణవంకకు ఇన్చార్జిలుగా కొనసాగుతారు. అలాగే, జమ్మికుంట మండలానికి సంబంధించి విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, జమ్మికుంట మున్సిపాలిటీకి సిరిసిల్ల రాజయ్య, ఈర్ల కొమరయ్యను ఇన్చార్జిలుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియమించారు. తూముకుంట నర్సారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లను హుజూరాబాద్ కు , బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జువ్వాడి నర్సింగరావు, ఇల్లంతకుంట నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లను హుజూరాబాద్ ప్రాంత మునిసిపాలిటీ పరిధికి కమలాపూర్ కు కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్ ఇన్చార్జిలుగా బాధ్యతలు నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.