
హుజూరాబాద్ ఉపఎన్నికకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఇందుకు సంబందించిన షెడ్యూలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నిక నిర్వహణకు వచ్చే నెల (సెప్టెంబరు) సరైన సమయమని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉపఎన్నిక షెడ్యూలు విడుదలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పార్టీలకు కూడా సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇప్పుడే ఉపఎన్నికకు సిద్ధంగా లేమని సీఈసీకి కేసీఆర్ సర్కార్ లేఖ కూడా రాసింది. అయినా.. ఉపఎన్నిక ఆగే పరిస్థితి కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెలలో 103 ఎమ్మెల్యే స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించే యోచనలో ఉంది. ఈ మేరకు కేంద్రం నుంచి సంకేతాలు రావడంతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అలెర్ట్ అయ్యాయి. హుజురాబాద్ లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి.