
హుజురాబాద్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయ్యింది. దీనితో పాటు బద్వేల్ కూడా ఉప ఎన్నికకు రెడీ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలను అక్టోబర్ లో నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంట్ స్థానాలతో పాటు, శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ని విడుదల చేసింది. మొత్తంగా మూడు పార్లమెంట్ స్థానాలతో పాటు,30 శాసనసభ స్థానాలకు అక్టోబర్ 30 న ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా హుజురాబాద్ తో పాటు బద్వేల్ ఉప ఎన్నికలు అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు విడుదల చేయనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య మరణంతో ఈ శాసనసభ స్థానం ఖాళీగా ఏర్పడింది. ఇక తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఎన్నిక అనివార్యం అయింది.