
హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం లో బీజేపీ పార్టీ ఆ పార్టీ హుజురాబాద్ లీడర్ షాక్ ఇచ్చారు. టిడిపి నుండి బిజెపి లో చేరిన సీనియర్ లీడర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. బీజేపీ పార్టీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను చేర్చుకోవటాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పెద్దిరెడ్డి, తర్వాత జరిగిన పరిణామాల వల్ల తాజాగా బీజేపీ పార్టీ కి రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ కి ఊహించని షాక్ తగిలింది.
ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకోవడం కారణంగా పెద్దిరెడ్డి రాజీనామా చేసినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.