
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, విలక్షణ దర్శకుడు క్రిష్ (రాధాకృష్ణ) జాగర్లమూడి దర్శత్వం వహిస్తున్న భారీ చిత్రం “హరిహర వీరమల్లు”, ఈ చిత్రాన్ని భారీ హంగులతో పాన్ ఇండియా లెవల్లో చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇదే.. ఈ చిత్రంపై భారీ అంచాలు వున్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ చాలా విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా విడుదల అయ్యాక ఖచ్చితంగా మరో స్థాయిలో ఉంటుంది అని, పవర్ స్టార్ అభిమానులు కలర్ ఎగిరేసేలా అద్భుతంగా ఉంటుందని, అభిమానులకి పండగలా ఉంటుందని అన్నారు. ఈయన చేసిన వ్యాఖ్యలతో ఈ సినిమా ఫై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నవిషయం తెలిసిందే . అలాగే ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.