
ఈ మధ్య ప్రజలు సోషల్ మీడియా ని ఎక్కువగా వాడుతున్నారు. ప్రశ్నించడం కూడా మొదలెట్టారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది అధికార పార్టీల నాయకులను గాని, ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రశ్నించడం వల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే వున్నాయి. ప్రశ్నించడం అనేది మన ప్రాథమిక హక్కు, ఆ హక్కుని సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఉపయోగించుకుంటున్నారు.
కాగా, తమ తమ తప్పులను సామాజిక మాధ్యమాల్లో ఎత్తి చూపితే ఓర్వలేక ప్రశ్నించే వారిపై అక్రమ కేస్ లు పెట్టించి కక్ష్య సాధింపు చర్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇలాంటి వారికి సుప్రీం కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సోషల్ మీడియా పోస్టులపై ఎటువంటి అరెస్టులు, శిక్షలు ఉండవు. FIR లు నమోదు చేయకూడదు. ఇప్పటికే నమోదైన కేసు లను రద్దు చేయండి. సుప్రీంకోర్టు చలవతో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ..*