
సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చను వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి సీతాఫలాలు వచ్చాయి. రోగనిరోధక శక్తి పెంపొందించే సీతాఫలం ఒక సంజీవనిలా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఈ ఫలం తీసుకోవడం ద్వారా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు తెలుసుకుందాం..

- ఇందులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఆకలిని తీర్చుతుంది.
- నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. ఫలితంగా జీర్ణక్రియ వేగవంతం అవుతుంది
- గర్భిణీలకు చాలా మంచిది. గర్భంలో ఉన్న శిశువు మెదడు, నాటీ వ్యవస్థ మెరుగు పడటానికి ఉపయోగపడే గుణాలు ఇందులో ఉంటాయి
- సీతాఫలం జ్యూస్ లో తేనె, పాలు కలిపి రెగ్యులర్ గా తీసుకొంటే బరువు పెరగవచ్చు
- ఇందులో ఉండే విటమిన్ బి6 ఆస్తమా ఎటాక్ ను తగ్గిస్తుంది.
- హార్ట్ ఎటాక్ నుండి కాపాడుతుంది
- మలబద్దకాన్ని నివారిస్తుంది
- టైప్ 2డయాబెటిస్‌ని ఇందులో ఉండే డైటరీ ఫైబర్ నివారిస్తుంది.
- రక్త ప్రసరణను కంట్రోల్ లో ఉంచుతుంది.
- దంత ఆరోగ్యానికి చాలా మంచిది.
- కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు ఈ పండులో ఉంటాయి