
అగ్ర కథానాయిక సమంత ‘పెళ్లి’పై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర సందేశాన్ని షేర్ చేశారు. ‘మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారని కంగారు పడకుండా తనని సమర్థంగా తీర్చిదిద్దండి. తన పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు తన చదువుకు ఖర్చు పెట్టండి. ఆమెను పెళ్లికి సిద్ధం చేసే ముందు తన కోసం తనని సిద్ధం చేయండి. అలాగే తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండటం నేర్పించండి. ఇతరులకు అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్దం చేయండి’ అని తెలిపింది. ఇలా అమ్మాయిల పెళ్లి గురించి మాట్లాడటంతో మరోసారి సమంత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం సమంతపై ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సామ్ ప్రవర్తన.. వ్యక్తిగత జీవితంపై ఇష్టానుసారంగా కథనాలు వెలడయ్యాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు సమంతకు మద్దతుగా నిలవగా.. నెటిజన్స్ మాత్రం సమంతపై ఆరోపణలు చేశారు.. సమంత అబార్షన్ చేయించుకుందని… తను ఇతరులతో క్లోజ్‌గా ఉంటుందని.. అందుకే సామ్ చై విడిపోయారంటూ కామెంట్స్ చేశారు. దీంతో సామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది… తన పై వస్తున్న రూమర్స్ అన్ని అవాస్తవం అని… ఇతరుల అనుకున్న మాదిరిగా తన జీవితం లేదని… తను తప్పు చేయలేదంటూ తెలిపింది. ప్రస్తుతం కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి తనకు సమయమివ్వాలని తెలిపింది.