
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇటీవల రిలీజైన టైటిల్ సాంగ్ రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ.. తాజాగా సంక్రాంతి బరినుంచి భీమ్లా నాయక్ తప్పుకొన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24, లేదా 25న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది.
వచ్చే సంక్రాంతి రేసులో ‘ఆర్ఆర్ఆర్’ (జనవరి 7), ‘రాధే శ్యామ్'( జనవరి 14) ఉన్నాయి. ‘బంగార్రాజు’ (జనవరి 15 – ఖరారు కాలేదు) ఉన్నాయి. మహేశ్ ‘సర్కారు వారిపాట’ చిత్రాన్ని కూడా మొదట జనవరి 13న విడుదల చేయాలని భావించింది చిత్రబృందం. కానీ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్1న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. మలయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా వస్తున్న భీమ్లా నాయక్ నాయక్ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. థమన్ అందిస్తున్న మ్యూజిక్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. వకీల్ సాబ్ తర్వాత థమన్ మరోసారి పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే ఆల్బం ఇచ్చాడని చెప్పొచ్చు. సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి.