
మధుమేహ సమస్య ఇప్పుడు చాలా మందిని ఆరోగ్య రీత్యా ఇబ్బంది పెడుతున్న సమస్య. చిన్న పెద్ద తేడా లేకుండా, వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతుండగా, షుగర్ వచ్చిందని మన చుట్టుపక్కల మనం రోజూ వింటూ ఉంటాం. మన బంధువుల్లోనే ఎవరో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతూ ఉంటారు. టైమ్ కి తినకపోవడం, తీపి వస్తువులు ఎక్కువగా తినడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. ఒకసారి వస్తే కంట్రోల్ లోకి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. మనకి ఇష్టమైన ఫుడ్ ను వదులుకోవాల్సి వస్తుంది. డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. షుగర్ వస్తే ఇక పోదని, జీవితాంతం ఇలాగే ఉండాల్సి వస్తుందని భయం కూడా చాలా మందిని వెంటాడుతు ఉంటుంది. ఈ భయం వలన చాలామంది ఒత్తిడికి గురవుతూ మరింత అనారోగ్యం పాలవుతున్నారు . అయితే డైట్ పాటించడం, వ్యామాయం చేయడం వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. మెడిసిన్స్ కంటే కూడా డైట్ పాటించడం, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ ను శరీరం నుండి వెళ్లగట్టవచ్చు. కాగా వర్షాకాలం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది. అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు బాధిస్తూ ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. దీంతో వర్షాకాలంలో డయాబెటిస్ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇతరులతో పోలిస్తే డయాబెటిస్ రోగుల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ గా ఉంటుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లు ఆరోగ్యం పై మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. దీంతో వర్షాకాలంలో షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో డయాబెటిస్ పేషెంట్స్ నీళ్లు ఎక్కువగా తాగాలి. చెమట రూపంలో శరీరంలో నీళ్లు బయటకు పోతాయి. శరీరానికి సరిపోయేంత నీళ్లు శరీరంలో లేకపోతే డీహైడ్రేట్ కు గురయ్యే అవకాశముంటుంది. దీంతో నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇక కొబ్బరి నీళ్లు కూడా తాగొచ్చు.ఇక బయట ఆహారం తినడం వల్ల ఇన్ఫెక్షన్ కి గురయ్యే అవకాశముంది. అందుకే ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. పచ్చి కూరగాయలు తినకపోవడం మంచిది. కూరగయాలను వెనిగర్ లేదా నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిలో కడగడం 1 ద్వారా బ్యాక్టీరియా చనిపోతుంది. అలాగే వేడి వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలి.
ఇక వానాకాలంలో చల్లని వాతావరణం వల్ల క్రిములు, బ్యాక్టీరియా చాలా శక్తివంతంగా ఉంటాయి. త్వరగా ఇన్ఫెక్షన్ సోకేలా చేస్తాయి. అందుకే రోజూ వేడి నీళ్లతో స్నానం చేయాలి. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. గోళ్లలో మట్టి చేరి బ్యాక్టీరియాలు చేరుతాయి. గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి.
వానాకాలంలో తడి బట్టలు అసలు వేసుకోవద్దు. ఇక పాదాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. శుభ్రంగా లేకపోతే డయాబెటిక్ పేషేంట్ లకు కాళ్ళ సమస్యలు ఏర్పడే అవకాశముంది . అలాగే తడి బట్టలు వేసుకోవడం వల్ల వెంటనే జ్వరం వస్తుంది. అందుకే పొడి బట్టలు మాత్రమే వేసుకోవాలి. వర్షాకాలంలో డయాబెటిస్ పేషెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.