
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కార్తీక మాస శోభ సంతరించుకుంది. ఈ రోజు నుండి కార్తీక మాసం మొదలు అవడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివ క్షేత్రాలు భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి.

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం లో కార్తీకమాస ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 4 వరకు ఈ ఉత్సవాలు జరపనున్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేశారు. భక్తులు తెల్లవారుజామున నుండి గుడికి రావడం తో గుడి ప్రాంగణం అంతా రద్దీగా వుంది. దర్శనానికి కొత్త సమయం పట్టేలా వుంది.

కాగా, వేములవాడ లోని శ్రీ రాజా రాజేశ్వర ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. దేవాలయ ప్రాంగణంలో భక్తులు తెల్లవారుజామున వచ్చి దీపారాధన చేశారు. దీపావళి పురస్కరించుకొని వేములవాడ పురవీధుల గుండా ఊరేగించి, భక్తులకు శ్రీ రాజా రాజేశ్వరి దేవత మూర్తులు దర్శనం ఇచ్చారు. తదనంతరం లక్ష్మి పూజ నిర్వహించారు.

