
వ్యవసాయ అనుబంధ రంగాలలో వృత్తిపరమైన, నైపుణ్య పరమమైన సలహాలు సూచనలు కోసం, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా రిటైర్డ్ అయిన దొండే అమరేశ్ కుమార్ మరియు విత్తన ధ్రువీకరణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ గా రిటైర్డ్ అయిన పెండ్యాల నరేంద్ర, పదవీ విరమణ అనంతరం తమ విలువైన సమయాన్ని & స్వీయ అనుభవాన్ని వృధా చేయకుండా, సరికొత్త ఆలోచనతో “పైనీర్ అగ్రిబిజినెస్ కన్సల్టెన్సీ” అనే కంపెనీని ప్రారంభించారు. ఇప్పటికే ఈ కంపెనీ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు పేరొందిన ప్రముఖ అగ్రికల్చర్ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకోని నెలకు రోజుల వారీగా ఆయా కంపెనీలకు కన్సల్టెన్సీ సర్వీసులు అందిస్తుంది. అంతేకాకుండా NGO లకు, రైతులకు, ఇతర వ్యక్తులకు కూడా వ్యవసాయ అనుబంధ రంగాలపై సలహాలు, సూచనలు, శాస్త్ర సాంకేతిక పరమైన శిక్షణ నైపుణ్యం, అవగాహన కల్పించడం జరుగుతుంది.
అగ్రికల్చర్ కంపెనీలకు మరియు సంబంధిత నోడల్ ఏజెన్సీలు & వ్యవసాయ అనుబంధ రంగాల డిపార్ట్మెంట్ల మధ్య ఈ కన్సల్టెన్సీ అనుసంధానకర్తగా ఉండి వివిధ విభాగాలలో సలహాలు, సూచనలు ఇవ్వనున్నది. ముఖ్యంగా ప్రాసెసింగ్ ప్లాంట్లు, గోడౌన్లలో మౌలిక సదుపాయాల రూపకల్పన, విత్తన, ఫర్టీలైజర్, పెస్టిసైడ్& సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లైసెన్స్ లు పొందటంలో తోడ్పాటును అందించడం, విత్తన పరీక్ష ల్యాబులను మెరుగుపరచి అక్రిడిటేషన్ పొందడంలో తోడ్పాటును అందించడం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం, సేంద్రియ సాగు & దృవీకరణలో సలహాలు, పశుసంరక్షణ సర్వీసులు అందించడం (డైరీ ఫార్మ్స్, పౌల్ట్రీ ఫార్మ్స్, షీప్ ఫార్మ్స్, చేపల పెంపకం), మిద్దె తోటల పెంపకం, గార్డెనింగ్ & ల్యాండ్ స్కేపింగ్ వంటి సేవలను ఈ కన్సల్టెన్సీ ద్వారా అందించనున్నారు.
ఇతర వివరాల కోసం 8790661188 నంబర్ ను సంప్రదించండి.
డి. అమరేశ్ కుమార్ సహాయ వ్యవసాయ సంచాలకులు (రిటైర్డ్) వ్యవసాయ శాఖ తెలంగాణ రాష్ట్రం.
పెండ్యాల నరేంద్ర ఉప సంచాలకులు ( రిటైర్డ్) తెలంగాణ రాష్ట్ర సేంద్రియ మరియు విత్తన ధృవీకరణ సంస్థ.
ప్రదీప్ కుమార్ సి.ఈ. ఓ గా పని చేసి వివిధ కంపెనీల లో రిటైర్ అయ్యారు ఇతను విత్తన ఉత్పత్తి మరియు మార్కెటింగ్ రంగాలలో విశేష అనుభవం కలిగిన వ్యక్తి.