
రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలను ఇరుకున పెట్టె పెట్టాలని టీడీపీ భావిస్తుంది. ఇదిలా ఉండగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో పార్లమెంట్ ను స్తంభింప చేయాలని వైసీపీ భావిస్తోంది. బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని వైసీపీ నాయకులూ చూస్తున్నారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరుతున్నా, టీడీపీ వాళ్ళు ప్రజాసమస్యలు సైతం పట్టించుకోవాలని కోరుతున్నారు. కేంద్ర పరిధిలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై పోరాడాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. పార్లమెంట్ లో పోరాటానికి ప్రజాసమస్యలను టార్గెట్ చేసుకోవాలని టీడీపీ చెబుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ ను స్తంభింప చేసినా కేంద్ర ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదని తెలుస్తోంది. ఇదే సమయంలో వైసీపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ సైతం రాజకీయ వ్యూహాన్ని తెరపైకి తెస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడితే తాము సైతం రాజీనామా చేస్తామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. టీడీపీ పొలిట్ బ్యూరోలోను ఈ అంశంపై చర్చించినట్లు పేర్కొన్నారు. రఘురామపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్న వైసీపీపై వ్యూహాత్మకంగా టీడీపీ సైతం ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు కోసం వైసీపీ ఎంత పోరాడితే అంత మేలు జరుగుతుందని టీడీపీ నేతలు సూచిస్తున్నారు. ఈ మేరకు వారి పోరాటంపై అనుమానాలు పెరుగుతున్నాయి. రాజీనామాలతో కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా చూడాలని ఆశిస్తోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని హితవు చెబుతోంది. సొంత పార్టీ వ్యవహారాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పోరాటానికి ముందుకు రావాల్సిన అవసరం గుర్తించాలని సూచిస్తోంది. టీడీపీ చేసిన రాజీనామాల ఒత్తిడితో వైసీపీ ఇప్పుడు వ్యూహం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.