
తెలంగాణ లో ని శైవక్షేత్రాల వద్ద శ్రావణ మాస సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద శైవక్షేత్రంమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇవాళ శ్రావణమాసం 3వ సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలవడంతో క్యూలైన్లు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ పరిసరాలు జన సందోహంగా మారాయి. స్వామివారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతున్నది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయం వద్ద అధికారులు అన్నివసతులు కల్పించారు. మధ్యాహ్నానికి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.