
దళిత బంధు మాదిరిగానే బీసీ, ఎస్టీలకూ ప్రత్యేకమైన ‘బంధు’ పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తాము దళిత బంధుకు వ్యతిరేకం కాదని, బీసీలకు, ఎస్టీలకు కూడా అలాంటి పథకాలను అమలు చేయాలంటూ ఆ పార్టీ నిరసనకు దిగింది.
వికారాబాద్ జిల్లా పరిగిలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించారు. పోలీసులు వారికి అనుమతి నిరాకరించడంతో.. కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి, మంత్రి సబితారెడ్డి రాజీనామా చేయాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో.. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి.. కాంగ్రెస్ శ్రేణులను చెదరగొట్టారు. పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం.. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు.. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డప్పు చాటింపు వేశారు.