
closeup woman hand holding hair fall from hairbrush
జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలి అని ప్రతి ఆడపిల్ల కోరిక అందుకోసం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు కానీ మన జుట్టు ఆరోగ్యం మన ఆరోగ్యం తో ముడిపడి ఉంటుంది ఇది తెలియక చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి అనుకున్న ఫలితం లభించక బాధ పడుతుంటారు. అవిసె గింజలు పొడి చేసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే జుట్టు రాలడం కొంత వరకు తగ్గుతుంది… అవిసెగింజలు ఉన్న ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్, విటమిన్స్ ఏ ఇందుకు గల కారణం. వీటిలో పీచు పదార్థం ఎక్కువ. రక్తంలో ఐరన్ శాతం ని పెంచడం లో కూడా ఈ గింజలు ఎంతో తోడ్పడుతాయి.
అవిసెగింజలు మన శరీరంలో ఉన్న చెడు కొవ్వును కరిగిస్తాయి. స్త్రీల ఋతుక్రమం సరిగా పనిచేసేలా దోహదపడతాయి. నిత్యం ఇవి తినడం వల్ల చర్మ కాంతి మెరుగుపడుతుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది. కేవలం రోజుకు ఒక స్పూన్ అవిసె గింజల పొడిని తీసుకోవడం వల్ల పైన చెప్పిన ఫలితాలు పొందవచ్చు. వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. మలబద్ధకం కూడా రావచ్చు వీటిని తీసుకున్నపుడు నీరు ఎక్కువ గ తాగాలి. ఇవి గాలికి ఉంటే వీటిలోని పోషక విలువలు కోల్పోతాయి అందువల్ల గాలి పోనీ డబ్బాల్లో వీటిని భద్రపరచాలి. పొడి చేసుకున్న వారం లోపు ఆ పొడిని వినియోగించాలి లేదంటే పోషక విలువలు కోల్పోతాయి. వీటిని రాత్రి నానబెట్టి పొద్దున ఆ గింజలను 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉడికిస్తే జెల్ లాగా మారుతుంది. దీనిని హెయిర్ జెల్ లాగా కూడా వాడొచ్చు. గోరువెచ్చని నీటితో కానీ వేడి అన్నంలో కానీ ఒక స్పూన్ మించకుండా తీసుకోవడం మంచిది.