
బండ్ల గణేష్ తాజాగా వేసిన ఓ ట్వీట్ కాంట్రవర్సీకి దారి తీసింది. అది కాస్తా మహేష్ బాబు అభిమానులు ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. పవన్ కళ్యాణ్ రానా మూవీకి సంబంధించిన అప్డేట్ చెబుతూ నిన్న ఒక పోస్టర్‌ను చిత్రయూనిట్ వదిలింది. ఆగస్ట్ 15న మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ వదలబోతోన్నామంటూ లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్ స్టిల్‌ను షేర్ చేశారు. ఇక పవన్ లుంగీ ఎత్తి అలా నడుస్తున్న స్టిల్‌పై బండ్ల గణేష్ తన ప్రేమ, అభిమానాన్ని, భక్తిని చాటుకున్నారు. “దేవర దెబ్బ బాబుల్ గాడి అబ్బా” అని ట్వీట్ వేశారు. ఇందులో కొందరు పవన్ కళ్యాణ్ మీదున్న ప్రేమను చూస్తే.. ఇంకొందరు మహేష్ బాబు మీదే సెటైర్ వేశారని అనుకుంటున్నారు. అలా మహేష్ బాబు ఫ్యాన్స్ బండ్ల గణేష్‌ను ట్రోల్ చేస్తున్నారు. అసలే కాంట్రవర్సీలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న బండ్లన్నకు ఇలా మహేష్ బాబు అభిమానుల నుంచి ట్రోలింగ్ ఎదురుకావడంతో మొత్తంగా సోషల్ మీడియాకే దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే ఇలా ట్విట్టర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.. నా జీవితంలో కాంట్రవర్సీలు వద్దు అని బండ్లన్న చెప్పుకొచ్చారని తెలుస్తోంది.
త్వరలో కి ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పేస్తా No controversies. I don’t want any controversies in my life ?
— BANDLA GANESH. (@ganeshbandla) August 14, 2021