కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నేత వి.హనుమంతరావు గత కొద్ది రోజులుగా
తీవ్ర అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ హైదరాబాదు లో చికిత్స పొందుతున్నారు.
ఈ సందర్భంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, వీహెచ్ త్వరగా కోలుకోవాలంటూ ఓ ప్రకటన చేశారు. వీలైనంత త్వరగా ఆయన కోలుకొని మళ్లీ ప్రజాసేవకు అంకితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు . తాను ఇష్టపడే కాంగ్రెస్ పార్టీ నేతల్లో వీహెచ్ ఒకరని పవన్ అన్నారు.
వీహెచ్ గురించి జనసేనాని మాటల్లో:
ప్రజా సమస్యలపై పోరాటం సాగిండచంలోనూ, ప్రజా వాణిని బలంగా వినిపించడంలోనూ ఆయన శైలి ప్రత్యేకం అని కొనియాడారు. ఈ ప్రత్యేకత వల్లే ఆయనకు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఉన్నతస్థానం దక్కిందని అభిప్రాయపడ్డారు. హనుమంతరావు గారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికెళ్లి పోరాడతారని జనసేన అధినేత కితాబిచ్చారు. ఆయన చొరవ ఇతర నేతలకు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.

“వీహెచ్ ఆసుపత్రిలో చేరినప్పటినుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అపోలో వర్గాలను అడిగి తెలుసుకుంటూనే ఉన్నాను. అయితే అప్పుడు కొవిడ్ పరిస్థితులు బలంగా ఉన్నాయి. దానికి తోడు ఆయన ఐసీయూలో ఉన్నారు. డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రికి స్వయంగా వెళ్లి పరామర్శించలేకపోయాను. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో మళ్లీ రావాలని, రాజకీయ సేవ చేయాలని నా తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నా” అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో తెలిపారు.