
తెలుగులో వచ్చిన వాడు-వీడు సినిమా కాంబినేషన్ మల్లి రాబోతుంది. బాలా దర్శకత్వంలో వచ్చిన వాడు-వీడు చిత్రంలో హీరోలుగా నటించిన ఆర్య, విశాల్ మళ్ళీ తెరను పంచుకోనున్నారు. అప్పట్లో వాడు-వీడు చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. మళ్ళి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’ (Enemy). ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేసారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ ఇద్దరు హీరోలు అదరగొట్టేశారు. ఈ చిత్రంలో వెటరన్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటించారు.