
బాలకృష్ణ,బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక మళ్ళి ఈ కాంబినేషన్ లో ‘అఖండ’ అనే సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నెలాఖరుకల్లా చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. బాలకృష్ణ కు సెంటిమెంట్ ఎక్కువ అనేది తెలిసిందే. గతంలో దసరాకి వచ్చిన ఆయన సినిమా లు భారీ విజయాలను నమోదు చేసాయి. ఈ సెంటిమెంట్ ను ఈ ‘అఖండ’ సినిమా కు ఫాలో అవుతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు నిర్మాతలు తమ ఆలోచన ను మార్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే దసరా పండుగ సందర్బంగా పెద్ద పెద్ద సినిమా రిలీజ్ కి లైన్ లో వున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా దసరాకి రాకపోవచ్చు అనుకొని చిరంజీవి ‘ఆచార్య’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అలాగే బాలయ్య ‘అఖండ’ ఆ దిశగా అడుగులు వేశాయి. కానీ నిన్న రిలీజ్ చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ మేకింగ్ వీడియో చివర్లో రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ముందుగా చెప్పినట్టుగానే దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని స్పష్టత ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు మిగతా సినిమాలు తమ విడుదల సమయాలను పరిశీలించుకునే పనిలో పడ్డాయి. అలా ‘అఖండ’ సినిమాను వినాయక చవితికి ప్లాన్ చేస్తున్నారనే పీసీ అయ్యినట్టు ఫిలింనగర్ టాక్.