
సౌత్ ఇండియాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అనే పేరు తెలియని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు అంతలా పేరు సంపాదించాడు ఈ తమిళ నటుడు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చిన ఆ పాత్రలో జీవించడం ఆయన ప్రత్యేకత. ఆయన చాలా సినిమాల్లో హీరోగా చేస్తూ, వేరే హీరోల సినిమాల్లో మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా చేస్తారు. ఆయన తమిళంతో పాటు, తెలుగులో కూడా పలు రకాల పాత్రలు పోషించి సినీ ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఆ మధ్య వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమాను తమిళ్ లో హిట్ అయినా ‘ రాత్ససన్ ‘ నుండి రూపొందించారు. రాక్షసుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా చాల బాగా ఆదరించారు. ఇప్పుడీ ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో వున్నారు రాక్షసుడు డైరెక్టర్ రమేష్ వర్మ. మొదటి పార్ట్ హిట్ అవ్వడం తో సీక్వెల్ చేసే ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ సీక్వెల్ లో హీరోగా నటించే ఛాన్స్ విజయ్ కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా నిన్ననే ఈ ‘రాక్షసుడు 2’ చిత్రం పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడీ చిత్రంలో హీరోగా విజయ్ సేతుపతి నటించనున్నట్టు తాజా సమాచారం. ఇటీవల దర్శకుడు రమేశ్ వర్మ చెన్నై వెళ్లి, విజయ్ సేతుపతికి ఈ చిత్ర కథ వినిపించాడని, అది ఆయనకు బాగా నచ్చిందని అంటున్నారు. దాంతో ఈ చిత్రం తప్పకుండా చేస్తానని విజయ్ మాట ఇచ్చాడంట. ప్రస్తుతం తాను చేస్తున్న చిత్రాల డేట్స్ ను బట్టి, ఈ ‘రాక్షసుడు 2’కి డేట్స్ కేటాయిస్తారని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావచ్చు.